మసీదుల్లోకి భక్తుల ప్రవేశంపై ఆంక్షలు...

ABN , First Publish Date - 2020-03-25T17:04:39+05:30 IST

దేశంలో కరోనా వైరస్ సోకుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మసీదుల్లోకి భక్తుల ప్రవేశంపై ఇమాంల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది....

మసీదుల్లోకి భక్తుల ప్రవేశంపై ఆంక్షలు...

  • ఇమాంల సంఘం ప్రకటన 

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): దేశంలో కరోనా వైరస్ సోకుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మసీదుల్లోకి భక్తుల ప్రవేశంపై ఇమాంల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మసీదుల్లో రోజువారీ నమాజ్ కోసం భక్తులు ఎవరూ రావద్దని పశ్చిమబెంగాల్ ఇమాంల సంఘం ఛైర్మన్ ముహమ్మద్ యహియా బుధవారం జారీ చేసిన ప్రకటనలో కోరారు. కేవలం నలుగైదుగురు భక్తులతో మసీదుల్లో నమాజ్ చేస్తామని, ఈ ప్రార్థనలకు భక్తులెవరినీ అనుమతించమని ముహమ్మద్ యహియా స్పష్టం చేశారు. కరోనా వైరస్ ప్రబలుతున్నందున మసీదుల్లో ప్రజలు గుమిగూడవద్దని ఆయన సూచించారు. 

Updated Date - 2020-03-25T17:04:39+05:30 IST