నడ్డా కాన్వాయ్‌పై దాడి.. బెంగాల్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి: అమిత్ షా

ABN , First Publish Date - 2020-12-11T02:23:31+05:30 IST

నడ్డా కాన్వాయ్‌పై దాడి.. బెంగాల్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి: అమిత్ షా

నడ్డా కాన్వాయ్‌పై దాడి.. బెంగాల్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి: అమిత్ షా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం స్పందించారు. ఈ ప్రాయోజిత హింసకు బెంగాల్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ సంఘటనను మేము ఎంతగా ఖండిస్తున్నామో అది తక్కువ అని అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని చాలా తీవ్రంగా తీసుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.


జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఆయన గురువారం సౌత్ 24 పరగణాస్‌కు వెళ్తుండగా, ఆయన కాన్వాయ్‌పై రాళ్ళ దాడి జరిగింది. ఈ దాడిలో బీజేపీ నేతలు కైలాశ్ విజయవర్గీయ గాయపడినట్లు ఆ పార్టీ ఆరోపించింది. తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించింది.

Updated Date - 2020-12-11T02:23:31+05:30 IST