బాలికపై అత్యాచారం, హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం!

ABN , First Publish Date - 2020-08-22T23:38:59+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో దారుణం జరిగింది. 16 బాలికపై పలుమార్లు అత్యాచారానికి

బాలికపై అత్యాచారం, హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం!

జల్పాయిగురి: పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో దారుణం జరిగింది. 16 బాలికపై పలుమార్లు అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆపై ఆమెను దారుణంగా హతమార్చి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం వారికి 8 రోజుల పోలీసుల కస్టడీకి ఆదేశించింది. 


రాజ్‌గంజ్‌లోని శ్యానషికతకు చెందిన బాధిత బాలిక ఈ నెల 10న అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం తల్లిదండ్రులు గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నెల 15న బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు విచారణలో నిందితులు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం బాలిక మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేసినట్టు తెలిపారు. ప్రధాన్ పరాలోని ఓ ఇంటిలో పడేసిన సెప్టిక్ ట్యాంకు నుంచి మృతదేహాన్ని వెలికి తీసినట్టు పోలీసులు పేర్కొన్నారు.  

Updated Date - 2020-08-22T23:38:59+05:30 IST