నడ్డా కాన్వాయ్‌పై దాడిపై మీటింగ్‌కు బెంగాల్ సీఎస్, డీజీపీ దూరం

ABN , First Publish Date - 2020-12-12T01:35:35+05:30 IST

శుక్రవారం ఉదయం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చింది. ఇందులో జెడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులపై దాడులు జరగడం పట్ల బెంగాల్‌లో శాంతి భద్రతల సమస్యపై చర్చించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని

నడ్డా కాన్వాయ్‌పై దాడిపై మీటింగ్‌కు బెంగాల్ సీఎస్, డీజీపీ దూరం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించి సోమవారం నిర్వహించనున్న సమావేశానికి బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీస్ బాస్ హాజరు కావడం లేదని సమాచారం. ఈ ఘటనపై వారిని ఇప్పటికే వారి నుంచి సమాధానాలు తీసుకున్నామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.


‘‘ఈ విషయమై మరిన్ని నివేదికలు తయారు అవుతున్నాయి, వాటన్నిటినీ కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తాం. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి దీనికి సంబంధించి సమాధానాలు తీసుకున్నాం. వారిని మళ్లీ విచారణకు పిలవాల్సిన అవసరం లేదని మిమ్మల్ని కోరుతున్నాం’’ అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్ పేర్కొన్నారు.


శుక్రవారం ఉదయం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చింది. ఇందులో జెడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులపై దాడులు జరగడం పట్ల బెంగాల్‌లో శాంతి భద్రతల సమస్యపై చర్చించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని డీజీపీని హాజరు కావాలని కేంద్రం సమన్లు జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ పంపిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - 2020-12-12T01:35:35+05:30 IST