బెంగాల్‌లో 1,000కి చేరిన కోవిడ్-19 మరణాలు

ABN , First Publish Date - 2020-07-16T01:32:53+05:30 IST

ఇక ఈరోజు కొత్తగా 1,589 కేసులు పశ్చిమ బెంగాల్‌లో నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 34,000 దాటింది. 20 వేల మంది కరోనా నుంచి కోలుకోగా 13 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఎక్కువగా కేసులున్న

బెంగాల్‌లో 1,000కి చేరిన కోవిడ్-19 మరణాలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల వెయ్యి మంది చనిపోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ రోజు కొత్తగా 20 మంది మరణించడంతో మృతుల సంఖ్య 1,000కి చేరుకున్నట్లు వారు పేర్కొన్నారు.


ఇక ఈరోజు కొత్తగా 1,589 కేసులు పశ్చిమ బెంగాల్‌లో నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 34,000 దాటింది. 20 వేల మంది కరోనా నుంచి కోలుకోగా 13 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఎక్కువగా కేసులున్న రాష్ట్రాల్లో బెంగాల్ 9వ స్థానంలో ఉంది.

Updated Date - 2020-07-16T01:32:53+05:30 IST