వర్క్ ఫ్రమ్ హోంతో కంపెనీలకు లాభం !

ABN , First Publish Date - 2020-09-01T23:22:08+05:30 IST

కరోనా నేపధ్యంలో పలు సంస్థలు, ప్రత్యేకించి ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సగటు భారతీయుడికి చాలా వరకు సమయం, డబ్బు ఆదా అవుతుందని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్ సర్వేలో... ఏ మేరకు ఆదా అయిందనే అంశంపై సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.

వర్క్ ఫ్రమ్ హోంతో కంపెనీలకు లాభం !

ముంబై : కరోనా నేపధ్యంలో పలు సంస్థలు, ప్రత్యేకించి ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సగటు భారతీయుడికి చాలా వరకు సమయం, డబ్బు ఆదా అవుతుందని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్ సర్వేలో... ఏ మేరకు ఆదా అయిందనే అంశంపై సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.


వర్క్ ఫ్రం హోం తో సగటు భారతీయ ఉద్యోగి నెలకు దాదాపు రూ. 5,520 ను ఆదా చేస్తున్నారు. డబ్బుతో పాటు నెలకు సగటున 1.47 గంటల సమయాన్ని కూడా ఆదా చేస్తున్నాడని తేలింది. కార్యాలయానికి వెళ్లే సమయం తప్పింది. ఇంటి నుండే పని వల్ల ప్రయాణ సమయం లేకపోవడంతో దాదాపు రెండు గంటలు ఆదా అవుతోందట. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సగటు భారతీయులకు ఈ మేరకు ప్రయోజనం చేకూరిందని ఈ సర్వే వెల్లడించింది.


ఉద్యోగులకు కొన్ని చిక్కులు... అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కొంతమంది ఉద్యోగులు సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 27 శాతం మంది ఒంటరితనాన్ని, 23 శాతం మంది... వర్క్-లైఫ్ బ్యాలెన్స్పరంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కొన్ని కంపెనీలు ఇప్పటికీ టెక్నికల్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనివార్యం. కాబట్టి ఈ దిశగా దృష్టి సారిస్తున్నారు. ఉత్పాదకతపై రాజీపడకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారి సాధ్యమని తేలిపోయిందని, రానున్న అయిదేళ్లలో ‘ఇంటి నుండి పని’ పెరుగుతుందని అమిత్ రమణి అన్నారు. 


కాగా, ఈ సర్వేను దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో వెయ్యి మంది ఉద్యోగులతో నిర్వహించారు. వివిధ రంగాల్లోని ఉద్యోగుల నుండి సమాచారం సేకరించారు. ఈ సర్వే ప్రకారం 75 శాతం కంటే ఎక్కువమంది ఉద్యోగులు తమ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు. ఈ సర్వేలో ఉద్యోగుల జవాబుదారీతనం, కంపెనీల నుండి ఉద్యోగులకు నమ్మకాన్ని సంపాదించి పెట్టినట్లు తెలిపింది.


Updated Date - 2020-09-01T23:22:08+05:30 IST