ముష్టివారి ద్వారా కరోనా.. డబ్బులేయద్దు: చండీగఢ్ అధికారి

ABN , First Publish Date - 2020-07-27T23:11:29+05:30 IST

భిక్షాటన చేసేవారి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉందని చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ వద్ద సలహాదారుగా ఉన్న మనోజ్ పరిదా అధికారి వ్యాఖ్యానించారు.

ముష్టివారి ద్వారా కరోనా.. డబ్బులేయద్దు: చండీగఢ్ అధికారి

చండీగఢ్: భిక్షాటన చేసేవారి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉందని చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ వద్ద సలహాదారుగా ఉన్న మనోజ్ పరిదా అనే అధికారి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వారికి ముష్టి వేద్దని కూడా సూచించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా వ్యాఖ్యానించారు. ‘అడుక్కోవడం నేరం కాదు కాబట్టి వారిని జైళ్లలో పెట్టలేం. ప్రభుత్వ సిబిరాల్లోకి తరలిస్తేనేమో వారు అక్కడి నుంచి పారిపోతున్నారు. వీధుల్లోనే మకాం వేసి భిక్షాటన చేస్తున్నారు. కాబట్టి.. డబ్బులివ్వడం కుదరదని చెప్పేయండి’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇక తాజా లెక్కల ప్రకారం చండీగఢ్‌లో ఇప్పటివరకూ 852 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 284 యాక్టివ్ కేసులు కాగా.. మరో 852 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 13 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-07-27T23:11:29+05:30 IST