స్పెయిన్‌లో మళ్లీ కళకళలాడుతున్న బీచ్‌లు
ABN , First Publish Date - 2020-05-13T17:40:07+05:30 IST
కొవిడ్-19 వ్యాప్తి కారణంగా స్పెయిన్‌లో కొన్నాళ్లుగా బోసిపోయిన సాగర తీరాలు ఇప్పుడు మళ్లీ కళకళలాడుతున్నాయి...

మాడ్రిడ్: కొవిడ్-19 వ్యాప్తి కారణంగా స్పెయిన్‌లో కొన్నాళ్లుగా బోసిపోయిన సాగర తీరాలు ఇప్పుడు మళ్లీ కళకళలాడుతున్నాయి. సామాజిక దూరం పాటించేలా పలు నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. కొన్ని బీచ్‌లలో సన్‌బాతింగ్ సహా ఇతర వ్యాయామాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కొవిడ్-19 కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రపంచ దేశాల్లో స్పెయిన్ కూడా ఒకటి. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు కొన్నాళ్లుగా కఠినమైన లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడివాళ్లక్కడ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్ధిక వ్యవస్థ పతనంతో పాటు.. వందల, వేల మంది ఉపాధి కోల్పోయారు. ఇప్పటి వరకు స్పెయిన్‌లో 2.69 లక్షల మంది కరోనా బారిన పడగా.. 26,920 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 62,130 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.