పొగాకు చెట్లతో కరోనా వ్యాక్సిన్!
ABN , First Publish Date - 2020-04-02T01:24:15+05:30 IST
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పోగాకు ఉత్పత్తుల తయారీ సంస్థ బ్రిటీష్ అమెరికన్ టొబాకో..కరోనా వ్యాక్సిన్ తయారీకి రంగంలో దిగింది.

లండన్: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పొగాకు ఉత్పత్తుల తయారీ సంస్థ బ్రిటీష్ అమెరికన్ టొబాకో..కరోనా వ్యాక్సిన్ తయారీకి పూనుకుంది. తన అనుబంధ సంస్థ అయిన కెంటకీ బయోప్రాసెసింగ్ రూపొందించిన పొగాకు చెట్ల ఆధారిత టెక్నాలజీ సాయంతో కరోనా వ్యాక్సిన్ రూపొందింస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీ క్లీనికల్ ట్రయల్స్‌కు మందు దశలో ఉందని, జంతువులపై పరీక్షలు జరుపుతున్నామని తెలిపింది. కరోనా వైరస్ జన్యుక్రమంలో కొంత భాగాన్ని క్లోన్ చేశామని తెలిపింది. వైరస్ జన్యు క్రమాన్ని పొగాకు చెట్టులో ప్రవేశపెట్టి వ్యాక్సిన్‌ను తయారు చేశామని తెలిపింది. అలా తయారైన వ్యాక్సిన్ చెట్టునుంచి వేరు చేసి, సుద్ధి చేసి ప్రస్తుతం జంతవులపై పరీక్షిస్తున్నామని వెల్లడించింది. ఈ టెక్నాలజీతో వ్యాక్సిన్ ఉత్పత్తి మరింత వేగవంతమవుతుందని, దీని తాలూకు వివరాలను అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌తో పంచుకుంటున్నామని తెలిపింది.ఇక జూన్ నాటికి తొలి బ్యాచ్ సిద్ధమయ్యే అవకాశముందని పేర్కొంది.