తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో క్షౌరశాలలకు అనుమతి

ABN , First Publish Date - 2020-05-18T21:16:11+05:30 IST

తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో క్షౌరశాలలు తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం...

తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో క్షౌరశాలలకు అనుమతి

చెన్నై: తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో క్షౌరశాలలు తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే.. క్షౌరం చేసేవారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, చేతులకు గ్లౌజులు వేసుకోవాలని స్పష్టం చేసింది. డిస్‌ఇన్ఫెక్టంట్ స్ప్రేతో రోజుకు ఐదుసార్లు క్షౌరశాలలను శుభ్రం చేసుకోవాలని సూచించింది. బార్బర్ షాపులకు వెళ్లేవారు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించింది. చెన్నైలో, తమిళనాడులోని కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో క్షౌరశాలలు తెరవకూడదని ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-05-18T21:16:11+05:30 IST