బంగ్లాదేశ్ వరదల్లో 54 మంది మృతి

ABN , First Publish Date - 2020-07-22T13:18:57+05:30 IST

బంగ్లాదేశ్ లో సంభవించిన వరదల వల్ల 54 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది....

బంగ్లాదేశ్ వరదల్లో 54 మంది మృతి

ఢాకా (బంగ్లాదేశ్) : బంగ్లాదేశ్ లో సంభవించిన వరదల వల్ల 54 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. బంగ్లాదేశ్ లో కురుస్తున్న భారీవర్షాల వల్ల సంభవించిన వరదల్లో ముంపునకు గురైన 56వేల మందిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ చెప్పారు. 2.4 మిలియన్ల మంది వరదల బారినపడ్డారని డుజారిక్ చెప్పారు. వరద విపత్తుతో అల్లాడుతున్న బంగ్లాదేశ్ కు మానవత్వంతో ఆహారం, మంచినీరు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో వరదబాధితులను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి ద్వారా 5.2మిలియన్ల అమెరికా డాలర్లను ఇచ్చామని డుజారిక్ చెప్పారు. అసలే కరోనాతో విలవిల్లాడుతున్న బంగ్లాదేశ్ లో తుపాన్ ముప్పు తీరని నష్టం కలిగించింది. 

Updated Date - 2020-07-22T13:18:57+05:30 IST