బంగ్లాదేశ్‌లో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-06-19T00:22:03+05:30 IST

బంగ్లాదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో ఇక్కడ రికార్డు

బంగ్లాదేశ్‌లో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఢాకా: బంగ్లాదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో ఇక్కడ రికార్డు స్థాయిలో 3,803 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య లక్ష మార్కును దాటినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా మరో 38 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,343కి పెరిగింది. కాగా బంగ్లాదేశ్‌లో ఇప్పటి మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 102,292 కి చేరినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) అదనపు డైరెక్టర్ జనరల్ నసీమా సుల్తానా వెల్లడించారు. 

Updated Date - 2020-06-19T00:22:03+05:30 IST