బెంగళూరులో కోవిడ్ రోగుల కోసం ఎయిర్ అంబులెన్స్

ABN , First Publish Date - 2020-09-01T17:30:05+05:30 IST

అత్యవసర పరిస్థితిలో రోగులకు సేవ చేసేందుకు ఎయిర్ అంబులెన్స్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది.

బెంగళూరులో కోవిడ్ రోగుల కోసం ఎయిర్ అంబులెన్స్

బెంగళూరు : అత్యవసర పరిస్థితిలో రోగులకు సేవ చేసేందుకు ఎయిర్ అంబులెన్స్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఈ సేవలను అందించే తొలి విమానాశ్రయంగా బెంగళూరులోని జక్కూర్ విమానాశ్రయం నిలవబోతోంది. 


హెలికాప్టర్, విమానం అంబులెన్స్ సేవలు ఈ నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. మారుమూల గ్రామాల నుంచి సైతం రోగులను తీసుకొచ్చేందుకు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. 


ఈ ఎయిర్ అంబులెన్స్‌లో ఓ వైద్యుడు, పారామెడికల్ అధికారి, నర్సు, ఇద్దరు పైలట్లు ఉంటారు. ఈ సేవలను ఐకాట్ క్యాథి ఎయిర్ అంబులెన్స్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ మార్కెటింగ్ హెడ్ ఫహీం హుస్సేన్ మాట్లాడుతూ బెంగళూరు నుంచి ఎయిర్ అంబులెన్స్ సేవలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి యడియూరప్ప అంగీకరించారని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కూడా తాము ఈ సేవలను అందజేస్తున్నామన్నారు. 


Updated Date - 2020-09-01T17:30:05+05:30 IST