తబ్లీగీ జమాతేను నిషేధించండి : వీహెచ్‌పీ డిమాండ్

ABN , First Publish Date - 2020-04-06T00:50:27+05:30 IST

తబ్లీగీ జమాత్ సంస్థను వెంటనే నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఆ సంస్థకు తీవ్రవాదులతో సంబంధాలున్నాయని

తబ్లీగీ జమాతేను నిషేధించండి : వీహెచ్‌పీ డిమాండ్

న్యూఢిల్లీ : తబ్లీగీ జమాత్ సంస్థను వెంటనే నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఆ సంస్థకు తీవ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపించింది. ‘‘నిజాముద్దీన్ ప్రధాన కార్యాయంలో సదస్సు జరిగిన తర్వాత లక్షలాది మంది తబ్లీగీలు ప్రపంచవ్యాప్తంగా దుష్టత్వాన్ని, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారు. చాలా మంది ఉగ్రవాద సంస్థల స్థాపకులు కూడా తబ్లీగీ జమాతే సంస్థకు అనుంబంధంగా కొనసాగుతున్నారు’’ అని వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రెటరీ డా. సురేంద్ర జైన్ ఆరోపించారు.


మర్కజ్ భవంతితో పాటు ఆ సంస్థ బ్యాంకు అకౌంట్లను కూడా సీల్ చేయాలని, ఆ సంస్థ ఆర్థిక మూలాలను కనుగొనాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ సదస్సుకు అనుమతించిన సంబంధిత నేరస్థులపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు. తబ్లీగీ సభ్యుల మెదళ్లలో మతపరమైన మౌఢ్యాన్ని నింపారని, ఆ సంస్థ సభ్యులు అమానవీయంగా ప్రవర్తించిన ప్రవర్తనను చూసి యావత్తు ప్రపంచమే నిర్ఘాతపోయిందని మండిపడ్డారు. ఆ సంస్థ చేసిన దుశ్చర్యల కారణంగా దేశం మొత్తం నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆ సంస్థ ఆర్థిక మూలాలపై కేంద్రం ఓ కన్నేయాలని ఆయన సూచించారు. దేశం లాక్‌డౌన్ పాటిస్తున్న కారణంగా కొన్ని రోజులకు కరోనా ఎఫెక్ట్ తగ్గిందని, అయితే మార్చి 30 తరువాత నిజాముద్దీన్‌తో మరింత పెరిగిందని సురేంద్ర జైన్ తీవ్రంగా మండిపడ్డారు. 

Updated Date - 2020-04-06T00:50:27+05:30 IST