పీపీఈ కిట్ల ఎగుమతిపై నిషేధం ఎత్తివేయండి

ABN , First Publish Date - 2020-06-22T06:31:17+05:30 IST

విదేశాలకు వ్యక్తిగత రక్షణ పరికరాల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని తొలగించాలని వస్త్ర ఎగుమతి ప్రోత్సాహక మండలి చైర్మన్‌ ఎ.శక్తివేల్‌ ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు...

పీపీఈ కిట్ల ఎగుమతిపై నిషేధం ఎత్తివేయండి

  • కేంద్రానికి ఏఈపీసీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూన్‌ 21 : విదేశాలకు వ్యక్తిగత రక్షణ పరికరాల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని తొలగించాలని వస్త్ర ఎగుమతి ప్రోత్సాహక మండలి చైర్మన్‌ ఎ.శక్తివేల్‌ ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రతిరోజు 8 లక్షల యూనిట్ల పీపీఈ కిట్లు ఉత్పత్తి అవుతున్నాయని, దేశ అవసరాలకు మించి ఉత్పత్తి జరుగుతున్నందున విదేశాలకు ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో రూ.4.5 లక్షల కోట్ల విలువైన పీపీఈ కిట్ల ఎగుమతికి అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. 


Updated Date - 2020-06-22T06:31:17+05:30 IST