అజారుద్దీన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-30T22:49:32+05:30 IST

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్‌ బుధవారం ఉదయం ..

అజారుద్దీన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

జైపూర్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్‌ బుధవారం ఉదయం కారు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు అజారుద్దీన్ వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రణ్‌తంబోర్ తిరిగి వస్తుండగా రాజస్థాన్‌లోని సూర్వల్ వద్ద లాల్సాట్-కోట హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు బోల్తా పడింది. ప్రమాదం నుంచి వెంటనే తేరుకున్న అజారుద్దీన్‌ వేరే కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి హోటల్‌కు బయుదేరారు. అజారుద్దీన్ భారత్‌ తరఫున 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. 1992 నుంచి 1999 వరకూ భారత క్రికెట్ జట్టు తరఫున మూడుసార్లు ఐసీసీ వరల్డ్ కప్‌ పోటీలకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

Updated Date - 2020-12-30T22:49:32+05:30 IST