జమ్మూకశ్మీర్‌లో భారీ హిమపాతం...ప్రభుత్వం హెచ్చరిక

ABN , First Publish Date - 2020-11-25T14:17:07+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ బుధవారం హెచ్చరికలు....

జమ్మూకశ్మీర్‌లో భారీ హిమపాతం...ప్రభుత్వం హెచ్చరిక

శ్రీనగర్(జమ్మూకశ్మీర్) : జమ్మూకశ్మీర్‌లోని 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. లడఖ్ ప్రాంతంలో మంచు విస్తారంగా కురుస్తుండటంతో కేంద్ర పాలిత ప్రాంతంలో సర్కారు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో మంచు విస్తారంగా కురుస్తోంది. భారీ హిమపాతం వల్ల నవంబరు 17న కశ్మీరులోని కుప్వారాలో  ప్రాంతంలో ఓ సైనికుడు మరణించగా, మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.


హిమపాతం వల్ల రాంబన్, కిష్త్వార్, అనంతనాగ్, కుల్గాం, బారాముల్లా, గాండెర్బల్ జిల్లాల ప్రజలను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కశ్మీరులోని జాతీయ రహదారి 244 చింగం వైపు సింథన్ పాస్ సమీపంలో 10 మంది పౌరులు హిమపాతంలో చిక్కుకు పోయారు. దీంతో సైనికులు, జమ్మూకశ్మీర్ పోలీసులు వారిని రక్షించారు. 

Read more