ఆటోలు, క్యాబ్స్‌, బస్సులకు సీఎం గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2020-05-19T00:14:29+05:30 IST

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. లాక్‌డౌన్ విషయంలో కేంద్రం బాటలోనే పయనించిన సీఎం.. ఢిల్లీలోనూ మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

ఆటోలు, క్యాబ్స్‌, బస్సులకు సీఎం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. లాక్‌డౌన్ విషయంలో కేంద్రం బాటలోనే పయనించిన సీఎం.. ఢిల్లీలోనూ మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే సమయంలో కొన్ని వెలుసుబాట్లు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలో ఆటోలు, క్యాబ్స్, బస్సులు నడిపేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే, కొన్ని షరతులు విధించారు. ఆటో, ఈ-రిక్షా, సైకిల్ రిక్షాలో ఒకరికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్నారు. అదేవిధంగా క్యాబ్స్‌లో ఇద్దరికి పరిమితి విధించారు. బస్సుల్లో 20 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే, టూవీలర్‌పై ఒకరికి మించి ప్రయాణిస్తే చర్యలుంటాయని సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు.

Updated Date - 2020-05-19T00:14:29+05:30 IST