కస్టమర్లను గూగుల్ తప్పుదారి పట్టించింది: ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2020-07-28T00:07:53+05:30 IST

కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని అడ్వర్‌టైజ్‌మెంట్ అవసరాలకు వినియోగించుకునే విషయంలో గూగుల్ తన వినియోగదారులను తప్పుదారి పట్టించిందని ఆస్ట్రేలియా ప్రభుత్వాధీనంలోని కాంపిటీషన్ అండ్ కన్సూమర్ కమిషన్ సోమవారం ఆరోపించింది.

కస్టమర్లను గూగుల్ తప్పుదారి పట్టించింది: ఆస్ట్రేలియా

సిడ్నీ: కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని అడ్వర్‌టైజ్‌మెంట్ అవసరాలకు వినియోగించుకునే విషయంలో గూగుల్ తన వినియోగదారులను తప్పుదారి పట్టించిందని ఆస్ట్రేలియా ప్రభుత్వాధీనంలోని కాంపిటీషన్ అండ్ కన్సూమర్ కమిషన్ సోమవారం ఆరోపించింది. ఈ విషయంలో గూగుల్‌పై కోట్ల డాలర్ల జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపింది. గూగుల్ అకౌంట్లలోని కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఇతర వెబ్‌సైట్లలోని సమాచారానికి అనుసంధానిస్తూ 2016లో గూగుల్‌కు తీసుకున్న నిర్ణయాన్ని వారికి నేరుగా సూటిగా చెప్పలేదని కమిషన్ ఆరోపించింది. వారి నుంచి ఎటువంటి అనుమతీ తీసుకోకుండానే ఈ నిర్ణయాన్ని అమలు చేసిందని, దీని వల్ల గూగుల్‌కు భారీగా అదాయం లభించిందని కమిషన్ తేల్చింది. గుగూల్ కార్యకలాపాలను సమాచార భద్రతా కోణంలో అనేక దేశాల ప్రభుత్వాలు నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Updated Date - 2020-07-28T00:07:53+05:30 IST