ఆస్ట్రేలియన్లకు ఉచితంగా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-08-20T06:56:38+05:30 IST

ఆశలు రేకెత్తిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ (ఏజెడ్‌డీ1222) కోసం ఆస్ట్రేలియా కూడా క్యూ కట్టింది. ప్రయోగాలు విజయవంతమైతే తమ దేశంలోనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసుకునే వెసులుబాటును కల్పించే పేటెంట్ల కోసం ఆస్ట్రాజెనెకాతో...

ఆస్ట్రేలియన్లకు ఉచితంగా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌

కాన్‌బెర్రా, ఆగస్టు 19 : ఆశలు రేకెత్తిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ (ఏజెడ్‌డీ1222) కోసం ఆస్ట్రేలియా కూడా క్యూ కట్టింది. ప్రయోగాలు విజయవంతమైతే తమ దేశంలోనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసుకునే వెసులుబాటును కల్పించే పేటెంట్ల కోసం ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మారిసన్‌ వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2.5 కోట్ల మంది ఆస్ట్రేలియన్లందరికీ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. 

Read more