తెలుగు రాష్ట్రాల్లో దళితులపై దాడులు అమానుషం
ABN , First Publish Date - 2020-10-14T07:29:10+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లోనూ దళితులపై అమానుషంగా దాడులు చేస్తున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు...

- దోషుల ఆస్తులు జప్తు చేయాలి: బి.వెంకట్
న్యూఢిల్లీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోనూ దళితులపై అమానుషంగా దాడులు చేస్తున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. హాథ్రస్ ఘటనకు నిరసనగా మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ తదితర సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా వెంకట్ విలేకరులతో మాట్లాడుతూ.. అత్యాచారాలు, దాడులు చేసే వారికి శిక్షలు విధించడంతో పాటు వారి ఆస్తులు జప్తు చేసి బాధిత కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు.