రెబెల్ ఎమ్మెల్యేల కోసం రిసార్టులకు పోలీసులు.. లేరని తెలిసి...

ABN , First Publish Date - 2020-07-18T22:55:45+05:30 IST

రాజస్థాన్ పోలీసులకు హర్యానాలో చుక్కెదురైంది. హర్యానాలోని మానేసర్ రిసార్టుల్లో 18 మంది

రెబెల్ ఎమ్మెల్యేల కోసం రిసార్టులకు పోలీసులు.. లేరని తెలిసి...

జైపూర్ : రాజస్థాన్ పోలీసులకు హర్యానాలో చుక్కెదురైంది. హర్యానాలోని మానేసర్ రిసార్టుల్లో 18 మంది రెబెల్స్ తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. తీరా... అక్కడి వెళ్లి చూసే సరికి ఆ ఎమ్మెల్యేలు అందులో లేరు. దీంతో ఏమీ చేయలేక రాజస్థాన్‌కు తిరుగు పయనమయ్యారు. అయితే మొదట్లో ఆ రిసార్టుల్లోకి పోలీసులు రాజస్థాన్ పోలీసులను అనుమతించలేదు. దాదాపు గంటకు పైగా హోటల్ బయటే పోలీసులు వారి వాహనాలను నిలిపేశారు. ఆ తర్వాత అనుమతించారు. బీజేపీ ప్రభుత్వాలు తమకు ఏమాత్రం సహకరించడం లేదని కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తోంది. 

Updated Date - 2020-07-18T22:55:45+05:30 IST