జవాన్లకు, అధికారులకిచ్చే పోషకాల్లో తేడాలెందుకు?: రాహుల్

ABN , First Publish Date - 2020-09-12T15:47:13+05:30 IST

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటరీ ప్యానల్ కమిటీ భేటీకి ఎట్టకేలకు హాజరయ్యారు. గతంలో

జవాన్లకు, అధికారులకిచ్చే పోషకాల్లో తేడాలెందుకు?: రాహుల్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటరీ ప్యానల్ కమిటీ భేటీకి ఎట్టకేలకు హాజరయ్యారు. గతంలో ఒక్కసారి కూడా ఈ భేటీకి హాజరు కాలేదన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. ఇదే సమావేశానికి మహా దళపతి బిపిన్ రావత్ కూడా హాజరయ్యారు. రక్షణ దళాలకు ముఖ్యంగా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారికి అందిచే ఆహారం, వస్తువులను నాణ్యత, జాబితాను పరిశీలించే అంశం అజెండా పెట్టుకున్నారు.


ఈ సందర్భంగా ప్యానల్ ముందు రాహుల్ కొన్ని ప్రశ్నలను సంధించారు. ‘‘సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే జవాన్లకు, అధికారులకు అందించే పోషకాల విషయంలో తేడాలెందుకు?’’ అని రాహుల్ ప్యానల్‌ను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నను కేంద్రం ఖండించింది. అలాంటిదేమీ లేదని, అయితే జవాన్లు, అధికారుల ఆహారపు అలవాట్లలోనే వ్యత్యాసం ఉందని, ఎందుకుంటే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే అధికంగా ఉంటారని కేంద్రం వివరణ ఇచ్చింది. 

Updated Date - 2020-09-12T15:47:13+05:30 IST