నోట్లను తాకితే చేతులు కడుక్కోండి: ఐబీఏ
ABN , First Publish Date - 2020-03-23T06:38:24+05:30 IST
కరోనా మహమ్మారి నేపథ్యంలో కరెన్సీ నోట్లను తాకిన తర్వాత చేతులను కనీసం 20 సెకండ్ల పాటు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు ...

ముంబై, మార్చి 22 : కరోనా మహమ్మారి నేపథ్యంలో కరెన్సీ నోట్లను తాకిన తర్వాత చేతులను కనీసం 20 సెకండ్ల పాటు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) విజ్ఞప్తి చేసింది. లావాదేవీలు చేయడానికి ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ వంటి చానళ్లను ఉపయోగించుకోవాలని, నగదు చెల్లింపులకు బదులు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో చెల్లింపులు చేయాలని, అలాగే బ్యాంకు శాఖలను సందర్శించడం మానుకోవాలని ఐబీఏ సూచించింది.