కజిరంగా నేషనల్ పార్కు నేటి నుంచి పునర్ ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-21T11:23:38+05:30 IST

కరోనా వైరస్, వరద విపత్తులతో మూసివేసిన కజిరంగా నేషనల్ పార్కును...

కజిరంగా నేషనల్ పార్కు నేటి నుంచి  పునర్ ప్రారంభం

గువహటి (అసోం): కరోనా వైరస్, వరద విపత్తులతో మూసివేసిన కజిరంగా నేషనల్ పార్కును బుధవారం (నేడు)నుంచి సందర్శకుల  కోసం పునర్ ప్రారంభించారు.కరోనా, వరద విపత్తులతో అసోంలోని కజిరంగా జాతీయ ఉద్యానవనం, పులుల అభయారణ్యాలను ఏడు నెలల పాటు మూసివేశారు. అతిపెద్ద జాతీయ పార్కు అయిన కజిరంగా పునర్ ప్రారంభ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర అటవీశాఖ మంత్రి సుక్లబైద్యాలు పాల్గొననున్నారు. కజిరంగా పార్కులో జీపు సఫారీని అనుమతించనున్నట్లు అధికారులు చెప్పారు.


జాతీయ వనంలోని డోంగా వాచ్ టవర్, బిమోలి టినియాలిలను తర్వాత తెరుస్తామని జూపార్కు అధికారులు చెప్పారు.కజిరంగాలో ఏనుగు సఫారీని నవంబరు 1వతేదీ నుంచి ప్రారంభిస్తామని నేషనల్ పార్కు డైరెక్టరు శివకుమార్ చెప్పారు. ఈ జాతీయ ఉద్యానవనంలో సందర్శకులు కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ సందర్శించాలని డైరెక్టరు సూచించారు.ఈ ఏడాది కజిరంగాలో సంభవించిన వరదలతో 18 ఖడ్గమృగాలు, 107 జింకలు, 6 అడవిగేదెలు, 12 అడవి పందులతో సహా మొత్తం 153 అడవి జంతువులు మరణించాయి.

Updated Date - 2020-10-21T11:23:38+05:30 IST