మయన్మార్ నుంచి మాదకద్రవ్యాల రవాణ..15కోట్ల హెరాయిన్ స్వాధీనం

ABN , First Publish Date - 2020-10-19T15:12:29+05:30 IST

మయన్మార్ నుంచి సరిహద్దుల మీదుగా ఈశాన్య రాష్ట్రాల మీదుగా మాదకద్రవ్యాలు, ఆయుధాల రవాణ చేస్తున్న ముఠా గుట్టును అసోం పోలీసులు రట్టు చేశారు.....

మయన్మార్ నుంచి మాదకద్రవ్యాల రవాణ..15కోట్ల  హెరాయిన్ స్వాధీనం

గువాహటి (అసోం): మయన్మార్ నుంచి సరిహద్దుల మీదుగా ఈశాన్య రాష్ట్రాల మీదుగా మాదకద్రవ్యాలు, ఆయుధాల రవాణ చేస్తున్న ముఠా గుట్టును అసోం పోలీసులు రట్టు చేశారు. అసోంలోని రెండు వేర్వేరు ప్రాంతాలకు చెందిన నలుగురు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్టు చేసి వారినుంచి రూ.15 కోట్ల విలువగల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ అసోంలోని కార్బీ అంగ్లాంండు జిల్లాలో ఆరు ప్యాకెట్లలో 3.45 కిలోల హెరాయిన్ తీసుకువెళుతున్న ట్రక్కును పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు. మరో చోట ఓ ఇంటిపై దాి చేసి హెరాయిన్ 88 కంటైనర్లను  స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్ కు చెందిన ఇద్దరు మాదకద్రవ్యాలు సప్లయి చేస్తున్న స్మగ్లర్లను అసోం పోలీసులు అరెస్టు చేశారు. హెరాయిన్ ను విక్రయిస్తున్న మరో జంటను పోలీసులు అరెస్టు చేశారు.సెప్టెంబరు 27న అంగ్లాంగ్ జిల్లాలో రూ.25కోట్ల విలువైన డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నారని ఇంటెలిజెన్సు అధికారులు, భద్రతా దళాలు చేసిన హెచ్చరికలతో పోలీసులు పట్టుకున్నారు. 

Updated Date - 2020-10-19T15:12:29+05:30 IST