మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌కు కరోనా వైరస్

ABN , First Publish Date - 2020-05-08T16:36:04+05:30 IST

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన కార్ల దొంగకు కరోనా వైరస్ సోకింది....

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌కు కరోనా వైరస్

గౌహతి (అసోం): మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన కార్ల దొంగకు కరోనా వైరస్ సోకింది. అసోం రాష్ట్రంలోని సోనిత్ పూర్ జిల్లా దేఖియా జూలి పట్టణానికి చెందిన ఓ దొంగ పలు పోలీసుస్టేషన్ల పరిధుల్లో కార్లను చోరీ చేశాడు. రాజస్థాన్ రాష్ట్రంలో లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన ఘరానా దొంగ వలసకార్మికులతో కలిసి బస్సులో అసోం వచ్చాడు. గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్న కార్ల దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తప్పించుకు తిరుగుతున్న కార్ల దొంగను కరోనా వైరస్ లాక్ డౌన్ పట్టించినట్లయింది. అనంతరం అతనికి పరీక్షలు చేయగా కరోనా సోకిందని తేలింది. దీంతో కరోనా సోకిన దొంగతో కలిసి బస్సులో ప్రయాణించిన 42 మందితోపాటు డ్రైవరు, దొంగ భార్యాపిల్లలను క్వారంటైన్ కు తరలించారు. 

Updated Date - 2020-05-08T16:36:04+05:30 IST