కరోనా నేపథ్యంలో అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2020-04-25T02:25:29+05:30 IST

రోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఎక్కడి జనాలు అక్కడే జనాలు ఉండిపోయారు.

కరోనా నేపథ్యంలో అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం

న్యూ ఢిల్లీ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో ఎక్కడి జనాలు అక్కడే జనాలు ఉండిపోయారు. స్వస్థలాలకు వెళ్లడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వస్థలాలకు వెళ్లేందుకు లక్ష మందికి పాసులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన పాస్‌లు ఈ నెల 27వరకు మాత్రమే చెల్లుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత రాష్ట్రం నుంచి వెళ్లడానికి వీల్లేదని ప్రభుత్వం తెలిపింది. అయితే రైళ్లు కానీ.. బస్సులు కానీ తిరగవ్ సొంత వాహనాల్లో మాత్రమే ఊళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో వాహనాల్లేని వారి పరిస్థితి మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - 2020-04-25T02:25:29+05:30 IST