తరుణ్ గొగోయ్ గౌరవార్థం సెలవు ప్రకటించిన అసోం ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-11-26T05:28:57+05:30 IST

తరుణ్ గొగోయ్ గౌరవార్థం సెలవు ప్రకటించిన అసోం ప్రభుత్వం

తరుణ్ గొగోయ్ గౌరవార్థం సెలవు ప్రకటించిన అసోం ప్రభుత్వం

గువహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ గౌరవార్ధం అక్కడి ప్రభుత్వం గురువారం నాడు ఒకపూట సెలవు ప్రకటించింది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన గొగోయ్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఒకపూట సెలవు ప్రకటించినట్టు సాధారణ పరిపాలన విభాగం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, బోర్డులు, విద్యా సంస్థలను మూసివేయాలని పేర్కొంది. కాగా 84 ఏళ్ల గొగోయ్ మృతి పట్ల ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2001 నుంచి వరుసగా మూడు పర్యాయాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గొగోయ్ నేతృత్వం వహించారు. 

Read more