అసోం ప్రైవేటు హెలికాప్టరులో సాంకేతిక లోపం

ABN , First Publish Date - 2020-10-13T13:27:14+05:30 IST

అసోం ప్రైవేటు హెలికాప్టరులో సాంకేతిక లోపం ఏర్పడటంతో భూటాన్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది....

అసోం ప్రైవేటు హెలికాప్టరులో సాంకేతిక లోపం

భూటాన్‌లో అత్యవసర ల్యాండింగ్

గువహటి (అసోం): అసోం ప్రైవేటు హెలికాప్టరులో సాంకేతిక లోపం ఏర్పడటంతో భూటాన్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది.అసోం రాష్ట్రంలోని గువహటికి చెందిన స్కైయేన్ ఎయిర్ వేస్ కు చెందిన ప్రైవేటు హెలికాప్టరు అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ నుంచి టేకాఫ్ అయిన తర్వాత పైలెట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో ప్రైవేటు హెలికాప్టరును భూటాన్ లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 


 భూటాన్ రాజధాని నగరమైన టింపూకు 50 కిలోమీటర్ల దూరంలో పారోలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సహాయంతో స్కైయేన్ ఎంఐ172  హెలికాప్టరును భూటాన్ లోని స్లంగ్లామ్ హెలిప్యాడ్ సమీపంలో సురక్షితంగా దించారు. హెలికాప్టరులో ఉన్న సిబ్బంది, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అరుణాచల్ ప్రదేశ్ పౌరవిమానయాన కార్యదర్శి చెప్పారు. 

Updated Date - 2020-10-13T13:27:14+05:30 IST