కరోనా సునామీ నుంచి తేరుకోవాలంటే మరో ఏడాది పడుతుంది : మూడీస్

ABN , First Publish Date - 2020-03-25T17:55:46+05:30 IST

కరోనా సృష్టించిన కల్లోలం కారణంగా కుదేలైన ఆసియా ఆర్ధిక వ్యవస్థ కోలుకోవాలంటే...

కరోనా సునామీ నుంచి తేరుకోవాలంటే మరో ఏడాది పడుతుంది : మూడీస్

న్యూఢిల్లీ: కరోనా సృష్టించిన కల్లోలం కారణంగా కుదేలైన ఆసియా ఆర్ధిక వ్యవస్థ కోలుకోవాలంటే వచ్చే ఏడాది వరకు వేచిచూడాల్సిందేనని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూసీస్ పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతుండడం, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ నిలదొక్కుకునేందుకు ఆపసోపాలు పడుతున్న నేపథ్యంలో మూడీస్ ఈ మేరకు అంచనా వేసింది. కరోనా వైరస్ ప్రపంప ఆర్థిక వ్యవస్థలో సునామీ సృష్టించిందని మూడీస్ పేర్కొంది.


‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర తిరోగమనంలో మునిగిపోయింది. ఈ వైరస్ ఇప్పుడు ఆసియాలోని కీలకమైన ప్రాంతాలతో పాటు యూరోపియన్, అమెరికా సహా అన్ని ఆర్ధిక వ్యవస్థలు మూతపడేలా చేసింది. ఉద్యోగుల తొలగింపు, వ్యాపారాల్లో పెట్టుబడులు క్షీణించడం, పదవీ విరమణ ప్రయోజనాలు ఆవిరైపోవడం కారణంగా మరింత ఆర్ధిక బాధలు ఎదురయ్యే అవకాశం ఉంది...’’ అని మూడీస్ పేర్కొంది. ఇప్పటికే కేంద్రీయ బ్యాంకులు దీనిపై తీవ్రంగా స్పందించినప్పటికీ.. వడ్డీ రేట్లు సున్నాకన్నా తక్కువ స్థాయిలు తాకడం వల్ల చేతులెత్తేసే పరిస్థితి నెలకొన్నట్టు మూడీస్ పేర్కొంది. 

Updated Date - 2020-03-25T17:55:46+05:30 IST