గెహ్లాట్‌కు, కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలనుకుంటున్నా: మాయ

ABN , First Publish Date - 2020-07-29T04:55:42+05:30 IST

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తాను గుణపాఠం నేర్పాలనుకుంటున్నానని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి చెప్పారు. రాజస్థాన్‌లో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను

గెహ్లాట్‌కు, కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలనుకుంటున్నా: మాయ

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తాను గుణపాఠం నేర్పాలనుకుంటున్నానని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి చెప్పారు. రాజస్థాన్‌లో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఎస్‌పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె వాదిస్తున్నారు. గెహ్లాట్ చర్యలను తాను మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నానని మాయా గుర్తు చేశారు. అయితే గుణపాఠం చెప్పేందుకు సరైన సమయం కోసం ఎదురుచూశానన్నారు. 


రాజస్థాన్‌లో 19 మంది ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ తిరుగుబావుటా ఎగురవేయడంతో గెహ్లాట్ సర్కారు మైనార్టీలో పడింది. దీనికి తోడు తన పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన బీఎస్‌పీ విశ్వాస పరీక్ష జరిగితే గెహ్లాట్‌కు వ్యతిరేకంగా ఓటెయ్యాలని ఆదేశించారు. అంతటితో ఆగని మాయావతి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ మాయా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో గెహ్లాట్ సర్కారుకు మరిన్ని చిక్కులు ఏర్పడ్డాయి. 

Updated Date - 2020-07-29T04:55:42+05:30 IST