లెఫ్టినెంట్ గవర్నర్‌తో భేటీ కానున్న కేజ్రీవాల్... కీలక ప్రతిపాదన పెట్టనున్న కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-03-19T22:50:17+05:30 IST

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా జడలు విప్పడంతో దేశమంతా అలర్ట్ అయిన విషయం విదితమే. అందులో భాగంగానే

లెఫ్టినెంట్ గవర్నర్‌తో భేటీ కానున్న కేజ్రీవాల్... కీలక ప్రతిపాదన పెట్టనున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ : కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా జడలు విప్పడంతో దేశమంతా అలర్ట్ అయిన విషయం విదితమే. అందులో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే, మరిన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇదే విషయంపై గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బిజైల్‌తో భేటీ కానున్నారు.


ఈ భేటీలో సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు కీలక ప్రతిపాదన ఉంచనున్నారు. మార్చి 31 వరకు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలన్న ప్రతిపాదనను ఎల్జీ ముందు ఉంచనున్నారు. ఇలాగనైనా కొంతలో కొంత కరోనాను నివారించవచ్చని కేజ్రీ ఆలోచనగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అత్యవసర విభాగాలు మాత్రం యథావిధిగానే పనిచేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. 

Updated Date - 2020-03-19T22:50:17+05:30 IST