కేజ్రీ... లవ్‌ స్టోరీ!

ABN , First Publish Date - 2020-02-12T19:02:51+05:30 IST

ప్రతి మగాడి విజయం వెనుక మహిళ ఉంటుందన్న మాటను రుజువు చేస్తూ కేజ్రీకి అండగా నిలిచారు ఆయన భార్య సునీత.

కేజ్రీ... లవ్‌ స్టోరీ!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి : ప్రతి మగాడి విజయం వెనుక మహిళ ఉంటుందన్న మాటను రుజువు చేస్తూ కేజ్రీకి అండగా నిలిచారు ఆయన భార్య సునీత. వీరిది ప్రేమ వివాహం.  ఇద్దరూ సివిల్స్‌ పరీక్ష రాసి ఐఆర్‌ఎ్‌సకు ఎంపికై నాగ్‌పూర్‌లోని ఐఆర్‌ఎస్‌ అకాడమీలో శిక్షణ కోసం వచ్చారు. కేజ్రీ నిజాయితీ, దేశానికి సేవ చేయాలనే సంకల్పం ఆమెను ఆకట్టుకొన్నాయి. ఆమె తెలివితేటలు, వ్యక్తిత్వం చూసి కేజ్రీ కూడా ఆమెను ప్రేమించారు. కేజ్రీ కుటుంబం హరియాణాలోని హిస్సార్‌లో ఉండేది. సునీత కుటుంబం అప్పటికే ఢిల్లీలో స్థిరపడింది. కేజ్రీ, సునీత పెళ్లికి తొలుత వారి పెద్దలు ఒప్పుకోలేదు. తర్వాత సమ్మతి తెలిపారు. 1994 నవంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  వీరికి కుమార్తె హర్షిత, కుమారుడు పులకిత్‌ ఉన్నారు. 


ఇంతకంటే బర్త్‌డే గిఫ్ట్‌ ఏముంటుంది?

కేజ్రీవాల్‌ భార్య సునీత సంతోషం

తన పుట్టిన రోజున ఢిల్లీ ప్రజలు అందించిన విజయం కంటే పెద్ద బహుమతి ఏం ఉంటుందని కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన ఆమె ఎన్నికల్లో చురుగ్గా పనిచేశారు.  ఎన్నికల ప్రచారంలో ఎత్తుపల్లాలను చూశామని, తన భర్తపై ప్రత్యర్థులు వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-02-12T19:02:51+05:30 IST