అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ

ABN , First Publish Date - 2020-06-23T22:48:54+05:30 IST

అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ

అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ

ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆరోగ్య నిపుణులు, ఆర్మీ సిబ్బంది కావాలంటూ సీఎం కేజ్రీవాల్ కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు. దక్షిణ ఢిల్లీలోని రాధా సోమి సత్సంగ్ బియాస్ క్యాంపస్‌లో ఏర్పాటు చేస్తున్న 10,000 పడకల కోవిడ్ కేర్ కేంద్రాన్ని సందర్శించాలని అమిత్ షాను సీఎం కేజ్రీవాల్ ఆహ్వానించారు. ఇందు కోసం వైద్యులు, నర్సులు, ఐటీబీపీ, ఆర్మీ సిబ్బంది కావాలని కేజ్రీవాల్ కోరారు.

Read more