పరీక్ష లేకుండానే కరోనాను గుర్తించే ‘ఏఐ’

ABN , First Publish Date - 2020-05-13T07:54:41+05:30 IST

కొవిడ్‌-19 పరీక్ష చేయకుండానే.. కరోనా సోకిందో.. లేదో.. తేల్చగల కృత్రిమ మేధ(ఏఐ) పరిజ్ఞానాన్ని బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తమ ‘కొవిడ్‌ సింప్టమ్‌ స్టడీ’ యాప్‌లో ఆరోగ్య వివరాలను నమోదు...

పరీక్ష లేకుండానే కరోనాను గుర్తించే ‘ఏఐ’

లండన్‌, మే 12 : కొవిడ్‌-19 పరీక్ష చేయకుండానే.. కరోనా సోకిందో.. లేదో.. తేల్చగల కృత్రిమ మేధ(ఏఐ) పరిజ్ఞానాన్ని బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తమ ‘కొవిడ్‌ సింప్టమ్‌ స్టడీ’ యాప్‌లో ఆరోగ్య వివరాలను నమోదు చేసుకున్న 25 లక్షల మంది సమాచారాన్ని ఏఐతో విజయవంతంగా విశ్లేషించగలిగినట్లు వెల్లడించారు. వీరిలో 18 వేల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 7,178 మందికి పాజిటివ్‌ వచ్చింది. కొవిడ్‌-19 సోకినవారు అంతకుముందే తమ యాప్‌లో నమోదుచేసిన రోగలక్షణాల ప్రాతిపదికన కరోనా జాడను గుర్తించేలా ‘ఏఐ’ అల్గారిథమ్‌ను పొందుపర్చామన్నారు. 


Read more