దేశవ్యాప్తంగా ఖైదీలకు బెయిలు కోసం సుప్రీంకోర్టుకెళతాం : అర్షద్ మదానీ

ABN , First Publish Date - 2020-05-10T01:19:56+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో దేశంలోని జైళ్ళలో ఉన్న ఖైదీల్లో అర్హులకు

దేశవ్యాప్తంగా ఖైదీలకు బెయిలు కోసం సుప్రీంకోర్టుకెళతాం : అర్షద్ మదానీ

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో దేశంలోని జైళ్ళలో ఉన్న ఖైదీల్లో అర్హులకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయాలని జామియత్ ఉలేమా-ఏ-హింద్ కోరుతోంది. ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ శనివారం ఈ వివరాలు తెలిపారు. 


ఏడేళ్ళ కన్నా తక్కువ జైలు శిక్ష పడిన ఖైదీలకు, ఇతర ఖైదీల్లో అర్హులకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును సోమవారం ఆశ్రయిస్తామని తెలిపారు. 


ఈ అంశాన్ని సుప్రీంకోర్టు మార్చి 16న సుమోటోగా స్వీకరించిందన్నారు. మానవీయ కారణాలపై జైలులో నిర్బంధంలో ఉన్నవారికి బెయిలు మంజూరు చేయడంపై పరిశీలించేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందన్నారు. అయితే చాలా రాష్ట్రాలు దీనిపై ఎటువంటి చొరవ ప్రదర్శించలేదన్నారు. 


జైళ్ళలో పరిమితికి మించి ఖైదీలు ఉంటున్నారని, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు స్వీయ విచారణ జరుపుతోందన్నారు. 


Updated Date - 2020-05-10T01:19:56+05:30 IST