పుల్వామాలో ఎదురు కాల్పులు...ఆర్మీజవాను మృతి

ABN , First Publish Date - 2020-08-12T14:18:31+05:30 IST

సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాను మరణించగా, మరొక జవాను గాయపడ్డారు.

పుల్వామాలో ఎదురు కాల్పులు...ఆర్మీజవాను మృతి

 పుల్వామా: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని కంరాజీపొరా ప్రాంతంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాను మరణించగా, మరొక జవాను  గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడటంతో వారికి చికిత్స చేయడం కోసం శ్రీనగర్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో ఓ జవాన్ మరణించారు. మరో జవానుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కంరాజీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదుల కాల్పులతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరుపుతూ గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. ఉగ్రవాదుల సంచారం నేపథ్యంలో పుల్వామా జిల్లాలో భద్రతా బలగాల గాలింపును ముమ్మరం చేశారు.

Updated Date - 2020-08-12T14:18:31+05:30 IST