హీరో అర్జున్ కపూర్‌కు కరోనా

ABN , First Publish Date - 2020-09-06T22:26:23+05:30 IST

హీరో అర్జున్ కపూర్‌కు కరోనా

హీరో అర్జున్ కపూర్‌కు కరోనా

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. హీరో అర్జున్ కపూర్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయడంతో కోవిడ్ -19 పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. వైద్యులు, అధికారుల సూచన మేరకు ప్రస్తుతం తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లు అర్జున్ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. తాను బాధ్యత గల వ్యక్తిగా కరోనా వచ్చిన విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నట్లు కర్జున్ కపూర్ వెల్లడించారు.

Updated Date - 2020-09-06T22:26:23+05:30 IST