చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా యాపిల్ స్టోర్స్ మూసివేత.. కారణం అదే!

ABN , First Publish Date - 2020-03-15T18:38:58+05:30 IST

కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు

చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా యాపిల్ స్టోర్స్ మూసివేత.. కారణం అదే!

శాన్ ఫ్రాన్సిస్కో: కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ మూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాపిల్‌ యాజమాన్యం కూడా చర్యలు చేపట్టింది. చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్స్‌ను మార్చి 27 వరకు మూసివేస్తున్నట్టు ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేగాక కరోనా వైరస్ నిరోధానికి 15 మిలియన్ డాలర్లు విరాళమిస్తున్నట్టు తెలిపారు. చైనాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోందని.. అక్కడున్న యాపిల్ స్టోర్స్ పునఃప్రారంభం అవుతాయన్నారు. చైనాలోని గడ్డు పరిస్థితులను ఎదుర్కొని అంకితభావంతో పని చేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.      



Updated Date - 2020-03-15T18:38:58+05:30 IST