అపార్ట్‌మెంట్ ఓనర్ల సంచలన నిర్ణయం.. బయట వాళ్లొస్తే అన్నీ కట్

ABN , First Publish Date - 2020-05-11T17:08:36+05:30 IST

కరోనా భయం అందరినీ వెంటాడుతూనే ఉంది. ఎప్పుడు, ఎవరికి ఎలా సోకుతుందోనన్న ఆందోళనలో జనం ఉన్నారు.

అపార్ట్‌మెంట్ ఓనర్ల సంచలన నిర్ణయం.. బయట వాళ్లొస్తే అన్నీ కట్

గజియాబాద్: కరోనా భయం అందరినీ వెంటాడుతూనే ఉంది. ఎప్పుడు, ఎవరికి ఎలా సోకుతుందోనన్న ఆందోళనలో జనం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో ఉన్న అపార్ట్ మెంట్స్ ఓనర్స్ అసోషియేషన్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అపార్ట్‌మెంట్ వాసులు కొత్తగా ఎవరినీ లోనికి అనుమతించరాదని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే రూ.11వేల జరిమానా ఉంటుందని హెచ్చరించింది. అంతేగాక వాటర్, కరెంట్ కనెక్షన్లు కట్ అవుతాయని పేర్కొంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటం, ఇప్పటికే స్థానిక రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని మూడు సొసైటీలు కంటైన్మెంట్‌లోకి వెళ్లడంతో తాజా నిర్ణయాలు తీసుకున్నట్టు అసోషియేషన్ తెలిపింది. బయటవారిని లోనికి తీసుకురావొద్దని.. నిబంధనలను అతిక్రమిస్తే లీగల్ నోటీసులను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. సెక్యురిటీ సిబ్బందితో వాగ్వాదానికి దొగొద్దని తెలిపారు. 


అయితే ఈ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే మెజార్టీని దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు. దీనిపై అసోషియేషన్ సభ్యులు స్పందిస్తూ... నిబంధనలు అతిక్రమించి రోడ్డుపై వచ్చిన వారికి పోలీసులు చలాన్లు వేస్తున్నారని.. అలాగే తాము కూడా అని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.  

Updated Date - 2020-05-11T17:08:36+05:30 IST