జమ్మూలో ఇకపై ఎవరైనా భూములు కొనుగోలు చేసుకోవచ్చు : హోంశాఖ

ABN , First Publish Date - 2020-10-27T20:49:47+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లో భూములను కొనుగోలు చేసే విధానంపై కేంద్రం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జమ్మూ కశ్మీర్ లో ఎవరైనా

జమ్మూలో ఇకపై ఎవరైనా భూములు కొనుగోలు చేసుకోవచ్చు : హోంశాఖ

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో భూములను కొనుగోలు చేసే విధానంపై కేంద్రం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జమ్మూ కశ్మీర్ లో ఎవరైనా భూములను కొనుగోలు చేసుకోవచ్చు. అక్కడ నివాసం ఉండవచ్చు అని ప్రకటించింది. అయితే... వ్యవసాయ భూములు ఇందుకు మినహాయింపు అని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి నివాస యోగ్యతా పత్రాలు చూపించకుండానే భూములను కొనుగోలు చేసుకోవచ్చని హోంశాఖ స్పష్టం చేసింది. ఇదంతా జమ్మూ కశ్మీర్ పునర్య్వవ్యస్థీరణ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపింది. అయితే వ్యవసాయ భూములను మాత్రం వ్యవసాయం చేసే వారు మాత్రమే కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతేతరులు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది తమ అభిమతమని, పారిశ్రామిక భూముల్లో పెట్టుబడులు అత్యావశ్యకమని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. 

Updated Date - 2020-10-27T20:49:47+05:30 IST