2021 చివరి నాటికి సాధారణ జనజీవనం?: అమెరికా అంటువ్యాధి నిపుణులు

ABN , First Publish Date - 2020-09-13T17:21:58+05:30 IST

కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేంతవరకూ అంటే 2021 చివరి వరకూ సాధారణ జనజీవనం కష్టమేనని అమెరికాకు చెందిన అంటువ్యాధి నిపుణులు ఏంథనీ ఫాసీ పేర్కొన్నారు. మీడియాతో ఫసీ మాట్లాడుతూ...

2021 చివరి నాటికి సాధారణ జనజీవనం?: అమెరికా అంటువ్యాధి నిపుణులు

న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేంతవరకూ అంటే 2021 చివరి వరకూ సాధారణ జనజీవనం కష్టమేనని అమెరికాకు చెందిన అంటువ్యాధి నిపుణులు ఏంథనీ ఫాసీ పేర్కొన్నారు. మీడియాతో ఫసీ మాట్లాడుతూ కోవిడ్-19కు ముందున్నప్పటి పరిస్థితులు తిరిగి నెలకొనడం ఇప్పట్లో అసాధ్యమన్నారు. వచ్చే ఏడాది చివరి వరకూ సామాన్య జనజీవన పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేవన్నారు. 


వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి, పరిస్థితులు చక్కబడుతాయని భావిస్తున్నప్పటికీ, ఇప్పట్లో ఇటువంటి నమ్మకం ఏర్పడటం లేదన్నారు. అందరికీ టీకాలు వేసే కార్యక్రమం 2021లో ముమ్మరంగా జరగవచ్చన్నారు. అయితే కరోనా వైరస్ టీకా కోల్డ్ స్టోరేజ్ అనేది పలు దేశాలకు కష్టమైన పని అని అన్నారు. చాలా దేశాలలో కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు లేన్నారు.

Updated Date - 2020-09-13T17:21:58+05:30 IST