కేరళ గోల్డ్ స్కామ్‌ కేసులో మరో కీలక మలుపు

ABN , First Publish Date - 2020-08-18T18:46:42+05:30 IST

హైదరాబాద్: కేరళ గోల్డ్ స్కామ్‌ కేసు మరో కీలక మలుపు తిరిగింది. బంగారం స్మగ్లింగ్ చేసిన స్వప్న, సురేష్‌తో పాటు..

కేరళ గోల్డ్ స్కామ్‌ కేసులో మరో కీలక మలుపు

హైదరాబాద్: కేరళ గోల్డ్ స్కామ్‌ కేసు మరో కీలక మలుపు తిరిగింది. బంగారం స్మగ్లింగ్ చేసిన స్వప్న, సురేష్‌తో పాటు సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారి శివ శంకర్ మూడు సార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. 2017 - 2018లో మూడు దఫాలుగా శివ శంకర్‌తో కలిసి గల్ఫ్‌కి వెళ్లినట్లు ఈడీ తెలిపింది. శివ శంకర్ సూచనల మేరకు జాయింట్ బ్యాంక్ లాకర్‌లో డబ్బులు దాచి పెట్టినట్లు ఈడీ పేర్కొంది. మరింత లోతైన దర్యాప్తు కోసం స్వప్న సురేష్, సందీప్ నాయర్, సరిత్‌ను ఆగస్టు 26 వరకు నిందితులను జ్యూడిషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది.

Updated Date - 2020-08-18T18:46:42+05:30 IST