ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2020-12-06T06:59:17+05:30 IST
దిగిపోతున్న ట్రంప్ అధికార యంత్రాంగానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్(డీఏసీఏ) కార్యక్రమాన్ని యథాపూర్వస్థితికి తేవాలని ఫెడరల్ కోర్టు ఆదేశించింది.

వాషింగ్టన్, డిసెంబరు 5: దిగిపోతున్న ట్రంప్ అధికార యంత్రాంగానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్(డీఏసీఏ) కార్యక్రమాన్ని యథాపూర్వస్థితికి తేవాలని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. దీన్ని ఒబామా సర్కారు 2012లో తీసుకొచ్చింది. ఎలాంటి పత్రాలు లేకుండా చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చి నివసిస్తున్న వారికి డీఏసీఏ కింద పూర్తి చట్టపరమైన రక్షణ లభిస్తుంది. దాదాపు 7 లక్షల మంది యువత దీంతో లబ్ధి పొందుతున్నారు. వీరందరికీ వర్క్ పర్మిట్లు, ఆరోగ్య బీమా లభిస్తాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారులు, ఆ పార్టీకి చెందిన యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్‌మెంట్ చేపట్టే ప్రచారంతో సంబంధం ఉన్న వారి వీసాలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. కాగా, ఆరో గ్యం, ఇతర అత్యవసర పరిస్థితుల దృష్ట్యా స్వదేశం వెళ్లాలనుకుంటున్న భారత సంతతి కుటుంబాలకు ఎమర్జెన్సీ వీసాల జారీకి చర్యలు తీసుకోవాలని భారత్‌ను సామాజిక ఉద్యకారుడు ప్రేమ్ భండారీ కోరారు.