కరోనా బారిన పడిన మరో ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-07-15T03:53:15+05:30 IST

ఒడిశాలో అధికారి బీజేడీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. బాలాసోర్ జిల్లా...

కరోనా బారిన పడిన మరో ఎమ్మెల్యే

భువనేశ్వర్: ఒడిశాలో అధికారి బీజేడీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. బాలాసోర్ జిల్లా రెమూనా నియోజకవర్గ ఎమ్మెల్యే సుధాన్షు శేఖర్ పరిదాకి కొవిడ్-19 సోకినట్టు నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన నీలగిరి బీజేపీ ఎమ్మెల్యే సుకాంత కుమార్ నాయక్‌ను కలుసుకున్న పరిదా... పరీక్షల సమయానికే హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ‘‘నా తోటి ఎమ్మెల్యే ఒకరికి కరోనా పాజిటివ్ అని గుర్తించడంతో నేను హోం క్వారంటైన్లోకి వెళ్తున్నాను. ఈ నెల 11న నా శాంపిళ్లను కరోనా పరీక్షలకు పంపడం జరిగింది...’’ అని పరిదా తెలిపారు. ఇవాళ వెలువడిన ఫలితాల్లో ఆయనకు కరోనా సోకినట్టు తేలిందని అధికారులు పేర్కొన్నారు. బాలాసోర్ కొవిడ్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా పరిదా, నాయక్‌లతో పాటు సలీపూర్ ఎమ్మెల్యే ప్రశాంత్ బెహరాకి కూడా ఇటీవల ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైరస్ సోకిన ఎమ్మెల్యేలను ఎవరెవరు కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2020-07-15T03:53:15+05:30 IST