ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరో ఏనుగు దుర్మరణం
ABN , First Publish Date - 2020-06-11T22:30:19+05:30 IST
మూడు రోజులు తిరక్కుండానే ఛత్తీస్‌గఢ్‌లోని సుర్‌గుజా అడవుల్లో మరో ఏనుగు మృతి చెందింది. దీంతో మృతి చెందిన

న్యూఢిల్లీ : ఇరవై రోజులు తిరక్కుండానే ఛత్తీస్‌గఢ్‌లోని సుర్‌గుజా అడవుల్లో మరో ఏనుగు మృతి చెందింది. దీంతో మృతి చెందిన ఏనుగుల సంఖ్య మూడుకు చేరింది. బలరాంపూర్ జిల్లాలోని రాజ్‌పూర్ అడవుల్లో ఇప్పటికే రెండు ఏనుగులు మృతి చెందాయి. తాజాగా గర్భంతో ఉన్న మరో ఏనుగు మృతి చెందడం వెలుగులోకి వచ్చింది. ఈ ఏనుగుకు పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
మొదటి రెండు ఏనుగుల పోస్ట్‌మార్టమ్ రిపోర్టులు వచ్చాయని.. విషం తీసుకోవడం వల్లే మరణించాయని, సహజ మరణాలు కావని తేలిందని తెలిపారు. ‘‘ఈ ఏనుగుల మంద రాజ్‌పూర్ అడవులకు దగ్గర్లో ఉన్న ఓ గ్రామానికి వెళ్లి ఇళ్లను ధ్వంసం చేశాయి. మహువా పువ్వులను ఎక్కువగా తినడం వల్ల... అలాగే ఇళ్లలో దాచి ఉంచిన యూరియాను తినడం వల్ల మరణించాయి అన్నది మా ప్రాథమిక విచారణలో తేలింది’’ అని అధికారి వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు మాత్రం ఏనుగుల ఎలా మరణించాయన్నది మాత్రం సాధికారికంగా అటవీ శాఖ అధికారులు చెప్పలేకపోతున్నారు.