కశ్మీర్‌లో కరోనాతో సర్తల్‌దేవి యాత్ర రద్దు

ABN , First Publish Date - 2020-06-26T12:10:11+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో ప్రతీ ఏటా జరిగే సర్తల్‌దేవీ యాత్రపై కరోనా వైరస్ ప్రభావం పడింది....

కశ్మీర్‌లో కరోనాతో సర్తల్‌దేవి యాత్ర రద్దు

కిష్టావర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లో ప్రతీ ఏటా జరిగే సర్తల్‌దేవీ యాత్రపై కరోనా వైరస్ ప్రభావం పడింది. ప్రతీ ఏటా జూన్ 28వతేదీన జరిగే సర్తల్‌దేవీ యాత్రను కొవిడ్-19 ప్రభావం వల్ల ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు జమ్మూకశ్మీర్ అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ మాతా సర్తల్‌దేవీజీ యాత్రను రద్దు చేయడం దురదృష్టకరమని శ్రీ సర్తల్‌దేవీజీ మేనేజ్ మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ విక్రమాదిత్య సింగ్ ప్రకటించారు. కరోనా ప్రభావం వల్ల పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా సర్తల్‌దేవీజీ ఆలయంలో యజ్ఞయాగాదులు, పూజలు సంప్రదాయ పద్ధతిలో ఆలయపూజారులు నిర్వహిస్తారని కిష్టావర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ డిప్యూటీ కమిషనర్ చెప్పారు. పూజారులు ఆలయ మేనేజ్ మెంట్ కౌన్సిల్ సభ్యులతో కలిసి నిరాడంబరంగా ఆలయ ఆవరణలోనే పూజలు చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. సర్తల్ దేవీజీ ఆలయం కిష్టావర్ జిల్లాలోని పిర్ పంజాల్ రేంజ్ పర్వతంపై ఉంది. జమ్మూకశ్మీర్ లో గురువారం కొత్తగా మరో 127 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీతో జమ్మూకశ్మీర్ కరోనా కేసుల సంఖ్య 6,549 కి పెరిగింది. 90 మంది కరోనాతో మరణించిన నేపథ్యంలో సర్తల్ దేవీ యాత్రను రద్దు చేస్తూ జమ్మూకశ్మీర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2020-06-26T12:10:11+05:30 IST