అధికారంలో భాగమిచ్చే ప్రసక్తే లేదు!

ABN , First Publish Date - 2020-12-28T08:39:19+05:30 IST

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తే మిత్రపక్షమైన బీజేపీకి పాలనలో భాగస్వామ్యం ఇచ్చే ప్రసక్తే లేదంటూ అన్నాడీఎంకే షాక్‌ ఇచ్చింది...

అధికారంలో భాగమిచ్చే ప్రసక్తే లేదు!

  • బీజేపీకి షాక్‌ ఇచ్చిన అన్నాడీఎంకే


చెన్నై, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తే మిత్రపక్షమైన బీజేపీకి పాలనలో భాగస్వామ్యం ఇచ్చే ప్రసక్తే లేదంటూ అన్నాడీఎంకే షాక్‌ ఇచ్చింది. చెన్నై రాయపేట వైఎంసీఏ మైదానంలో ఆదివారం జరిగిన అన్నాడీఎంకే అధికారిక ప్రచార ప్రారంభోత్సవ సభలో పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మద్దతుదారుడైన డిప్యూటీ సమన్వయకర్త కేపీ మునుసామి మాట్లాడుతూ.. సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని అంగీకరించే పార్టీలు మాత్రమే కూటమిలో మిత్రపక్షాలుగా చేర్చుకునే అవకాశం ఉంటుందని బీజేపీని పరోక్షంగా హెచ్చరించారు. ఈ రెండు నిబంధనలకు కట్టుబడితేనే కూటమిలో కొనసాగిస్తామని లేకుంటే అన్నాడీఎంకే అధిష్ఠానం పునరాలోచించాల్సి వస్తుందన్నారు.

Updated Date - 2020-12-28T08:39:19+05:30 IST