ఉద్యోగికి కరోనా.. పశుసంవర్థక శాఖ కార్యాలయం మూసివేత

ABN , First Publish Date - 2020-05-18T23:05:09+05:30 IST

ఢిల్లీ పశుసంవర్థక శాఖలోని ఓ ఉద్యోగికి కరోనా సోకడంతో ఆ కార్యలయాన్ని రెండు రోజుల పాటూ మూసివేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయించింది.

ఉద్యోగికి కరోనా.. పశుసంవర్థక శాఖ కార్యాలయం మూసివేత

న్యూఢిల్లీ: ఢిల్లీ పశుసంవర్థక శాఖలోని ఓ ఉద్యోగికి కరోనా సోకడంతో ఆ కార్యలయాన్ని రెండు రోజుల పాటూ మూసివేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయించింది. మే 13న సదరు అధికారి ఆఫీసుకు వెళ్లాడని అదికారులు చెబతుతున్నారు. అతడికి సమీపంగా వచ్చిన వారందరినీ క్వారంటైన్‌లో వెళ్లాలని సూచించినట్టు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు.. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తొలిరోజున ఢిల్లీ నోయిడా హైవేపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది. సరిహద్దు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన పాస్‌లే లేకుండా ఢిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లొద్దని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సరైన పాస్‌లు లేని వారిని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తమ రాష్ట్రంలోకి అనుమతించరని చెబుతున్నారు. నాలుగో విడత లాక్ డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్య మంత్రి మరి కాసేపట్లో పత్రికా సమాశం నిర్వహించనున్నారు. 

Updated Date - 2020-05-18T23:05:09+05:30 IST